ముఖ్య సమాచారం
-
సచివాలయాలకు పర్యవేక్షకులొస్తున్నారు!
-
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు.. ముగ్గురు పరిస్థితి విషమం
-
డిసెంబర్ లో స్థానిక ఎన్నికలు.. క్యాబినెట్ నిర్ణయం
-
డ్వాక్రా మహిళలకు శుభవార్త
-
పేదల కష్టం తెలిసిన గొప్ప నేత సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
-
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష*
-
ఒకే కుటుంబంలో 18 మంది మృతి
-
క్షమించండి..మా సేవలు శాశ్వతంగానిలిపివేశాం: ఐబొమ్మ
-
సి ఎఫ్ ఎల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ రంగంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం
-
బొబ్బిలి పోలీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు
ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావుకు బిగుస్తున్న ఉచ్చు
Updated on: 2025-10-08 13:33:00
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదికలో కీలకమైన ఆధారాలు లభించాయని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నుంచి అందిన నివేదికలో, డిజిటల్ ఫోరెన్సిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా అత్యంత ముఖ్యమైన ఆధారాలు సేకరించినట్లు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.