ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Updated on: 2025-12-06 08:09:00
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న నిర్వహణ సంక్షోభం పరిష్కారం అంచున ఉందని, సంస్థపై చర్యలు తీసుకోవడం ఖాయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ ఇండిగో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు.కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని, ఇతర విమానయాన సంస్థలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని పాటిస్తున్నాయని గుర్తుచేశారు. కేవలం ఇండిగో మాత్రమే సమస్యలు ఎదుర్కోవడం చూస్తుంటే, తప్పు పూర్తిగా ఆ సంస్థదేనని స్పష్టమవుతోందన్నారు. "ఇతర ఎయిర్‌లైన్స్‌కు లేని సమస్య ఇండిగోకు మాత్రమే ఎందుకు వచ్చింది? కాబట్టి లోపం ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తోంది" అని మంత్రి పేర్కొన్నారు.