ముఖ్య సమాచారం
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
-
డిజిటల్ అరెస్టులకు చెక్ పెట్టేలా....జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
Updated on: 2026-02-25 09:08:00
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త శాఖ ఏర్పాటు అయ్యింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇన్నోవేషన్‌ను జోడిస్తూ కొత్త శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో మొత్తం 55 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. అలాగే సీఆర్డీఏ మరియు ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అయితే, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా విశాఖ, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి, చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కూడా కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు.. సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఉన్నత విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖల అభివృద్ధికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. విశాఖలో రూ. 2,387 కోట్ల వ్యయంతో సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ సంస్థలకు భూకేటాయింపుల అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ శాఖను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు