ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
Updated on: 2026-02-21 21:15:00
విజయవాడ: వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు రూ.3.5వేల కోట్ల కుంభకోణంలో రెండో నిందితుడిగా ఉన్న అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గతంలోనే ఏసీబీ కోర్టు నిరాకరించిన వేళ.. సిట్ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మద్యం కేసులో వాసుదేవరెడ్డితోపాటు ఎక్సైజ్‌శాఖ మాజీ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్ కీలక పాత్ర అని.. వారి కేంద్రంగానే కుంభకోణం జరిగిందని విజయవాడ ఏసీబీ కోర్టు గతంలో స్పష్టం చేసింది.
మొత్తం కుంభకోణం శరీరమైతే.. వారిద్దరూ తలలాంటివారని తెలిపింది. తల తీసేస్తే శరీరం కుప్పకూలుతుందని, వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు కట్టబెట్టడంలో.. వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. గతంలోనే ఆయన ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే అనుమానంతో వాసుదేవరెడ్డి బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విజయవాడలోని ఏసీబీ కోర్టుతోపాటు హైకోర్టు కూడా.. వాసుదేవరెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి.
ఈ నెల 27 వరకు రిమాండ్
వాసుదేవరెడ్డి రిమాండ్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆయన అప్రూవర్‌గా మారినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి సహకరిస్తున్నారని, వాసుదేవరెడ్డిని అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 27 వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో వాసుదేవరెడ్డిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.