ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఏప్రిల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
Updated on: 2026-02-21 16:32:00
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
ఏప్రిల్ నెలలో వివిధ తేదీల్లో వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే, జూన్ నెలల్లో ముగియనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటనలు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికలను 8 దశల్లో నిర్వహించారు. అసోంలో రెండు దశల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ఒకే దశలో నిర్వహించారు. కాగా ఇప్పటికే పుదుచ్ఛేరిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత ఫిబ్రవరి 14న తుది జాబితాను ప్రకటించారు. తమిళనాడులో మంగళవారం, కేరళలో ఈ నెల 21న ప్రకటించనున్నారు. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 28న ప్రచురించనున్నారు.