ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Updated on: 2025-12-07 12:05:00
విశాఖపట్నం: దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో టీన్ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత సఫారీలు 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటయ్యారు. ఈ లక్ష్యాన్ని
ఇంటర్నెట్ డెస్క్: గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న 'బర్చ్ బై రోమియో లేన్' నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు.
మృతుల్లో నలుగురు వరకు పర్యటకులు ఉన్నట్లు సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ తెలిపారు. మిగతావారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు, వారంతా కిచెన్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమవగా, 20 మంది ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.సిలిండర్ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి.
స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్లో భద్రతా చర్యలు పాటించలేదని తమకు తెలిసినట్లు చెప్పారు
విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు. అంతేకాకుండా ఈ క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రమాదంపై సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్ట ఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్ క్లబ్‌లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమతులు లేని క్లబ్ లైసెన్స్‌లు రద్దుచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
39.5 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ యశస్వి జైస్వాల్ (116*; 121 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్) శతకం బాదగా.. రోహిత్ శర్మ (75; 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (65*; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. రోహిత్, జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్, కోహ్లి అభేద్యమైన రెండో వికెట్‌కు 84 బంతుల్లో 116 పరుగులు జోడించి భారత్ కు ఘన విజయం అందించారు.