ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
Updated on: 2026-01-27 09:04:00
బంగారం కొనాలంటేనే సామాన్యుడు భయపడే రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 1.6 లక్షల వద్ద ఊగిసలాడుతుండగా, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది చివరకల్లా పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2.2 లక్షల మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. గడిచిన రెండు దశాబ్దాల కాలాన్ని గమనిస్తే పసిడి ధరలు పెరిగే వేగం ఊహాతీతంగా మారింది. 2007లో 10 గ్రాములు రూ. 10 వేలు ఉన్న ధర, అది రెట్టింపు కావడానికి (రూ. 20 వేలు) నాలుగేళ్లు పట్టింది. కానీ, రూ. 80 వేల స్థాయి నుంచి ఇప్పుడున్న రూ. 1.6 లక్షలకు చేరడానికి కేవలం రెండేళ్ల కాలం సరిపోయింది. అంటే పెరుగుదల రేటులో వేగం భారీగా పెరిగింది. 2026 ప్రారంభమైన ఈ 26 రోజుల్లోనే పసిడి ఏకంగా 18 శాతం ఎగబాకడం గమనార్హం.