ముఖ్య సమాచారం
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
-
సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే: చంద్రబాబు
-
ప్రకాశం జిల్లాలో లారీలు ఢీకొని డ్రైవర్ సజీవ దహనం
-
ఈ సంక్షోభానికి ఇండిగోనే కారణం: సీఎం చంద్రబాబు
-
స్క్రబ్ టైఫస్ గురించి ఆందోళన అక్కర్లేదు: ఏపీ ఆరోగ్యశాఖ
-
తెలంగాణలో చంపేస్తున్న చలి!
-
రూ.5 వేలు చెల్లిస్తే సైకిల్ దరఖాస్తు చేసుకోండి...
-
పవర్ లిఫ్టింగ్ లో ప్రతిభ చాటుతున్న నటి..!
-
కంటైనర్ ను ఆపింది ఏఎస్ఐ కుమారుడే!
800 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురి దుర్మరణం
Updated on: 2025-12-08 07:55:00
మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్ జిల్లాలోని ప్రసిద్ధ సప్తశృంగి మాత ఆలయానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి 800 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
పటేల్ కుటుంబ సభ్యులు ఆలయ దర్శనానికి కారులో బయల్దేరారు. భవారీ జలపాతం సమీపంలోని ఘాట్ రోడ్డులో ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మార్గంలో రహదారి చాలా ఇరుకుగా, ప్రమాదకరమైన మలుపులతో ఉంటుంది. అదుపుతప్పిన కారు రోడ్డు అంచు నుంచి లోయలోకి దూసుకెళ్లడంతో అందులో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను కీర్తి పటేల్ (50), రసిలా పటేల్ (50), విఠల్ పటేల్ (65), లతా పటేల్ (60), పచన్ పటేల్ (60), మణిబెన్ పటేల్ (60)గా పోలీసులు గుర్తించారు. వీరంతా దగ్గరి బంధువులు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.