ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
Updated on: 2025-12-07 12:07:00
గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న 'బర్చ్ బై రోమియో లేన్' నైట్ క్లబ్లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు వరకు పర్యటకులు ఉన్నట్లు సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ తెలిపారు. మిగతావారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు, వారంతా కిచెన్ సిబ్బంది అని అధికారులు తెలిపారు.
మృతుల్లో ముగ్గురు సజీవదహనమవగా, 20 మంది ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.సిలిండర్ పేలుడు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమోద్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ప్రమాదం జరిగిన నైట్ క్లబ్లో భద్రతా చర్యలు పాటించలేదని తమకు తెలిసినట్లు చెప్పారు
విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నామన్నారు. అంతేకాకుండా ఈ క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రమాదంపై సీఎం ప్రమోద్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్ట ఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్ క్లబ్‌లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమతులు లేని క్లబ్ లైసెన్స్‌లు రద్దుచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు