ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
Updated on: 2025-12-07 12:10:00
ఉయ్యూరు మండలం ముదునూరులో ఒకరి మృతి
అధికారికంగా కృష్ణాలో 15, ఎన్టీఆర్‌లో రెండు కేసులు
స్క్రబ్ టైఫస్ ఉమ్మడి కృష్ణాజిల్లాను కలవరపెడుతోంది. కృష్ణాజిల్లాలో 15 కేసులు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్క్రబ్ టైఫస్ బారిన పడి ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన బుట్టి శివశంకర్‌రాజు (42) ఈనెల 4న మృతిచెందడం కలకలం రేపుతోంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆయన మచిలీపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. లక్షణాలను బట్టి పరీక్ష చేయగా, స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాం (ఐహెచ్ఐపీ) పోర్టల్‌లో రాజుకు పాజిటివ్ వచ్చినట్టుగా అప్లోడ్ చేశారు. విషయం తెలుసుకున్న కృష్ణాజిల్లా వైద్యాధికారి డాక్టర్ పి.యుగంధర్ శనివారం సాయంత్రం ముదునూరులోని మృతుడు శివశంకర్‌రాజు ఇంటికి వెళ్లారు. అతని కుటుంబసభ్యులు, స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధితో శివశంకరరాజు బాధపడుతున్నట్లు తమ విచారణలో తేలిందని, దీనివల్లే ఆయన మృతిచెందినట్లు నిర్ధారణకు వచ్చామని వెల్లడించారు. పేడపురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుందని, కానీ చనిపోయే అవకాశాలు చాలా తక్కువని తెలిపారు. మందులు వాడితే తగ్గిపోతుందన్నారు
గుడ్లవల్లేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి యశస్వినీ శనివారం తెలిపారు. స్థానిక ఇందిరా కాలనీకి చెందిన మానస, పామర్రుకు చెందిన అమలేశ్వరి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యంతో వచ్చారని, రక్త నమూనాలను సేకరించి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పంపగా, స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నమోదైందన్నారు. ఇద్దరికీ చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.