ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
Updated on: 2025-12-06 08:11:00
రామనాథపురం వద్ద రెండు కార్లు ఢీ..ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందడం విషాదాన్ని నింపింది.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. రామేశ్వరం నుంచి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతి చెందినవారిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారని గుర్తించారు.గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న కీజక్కరై పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి..