ముఖ్య సమాచారం
-
రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి ధర
-
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
-
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
Updated on: 2026-02-04 12:16:00
ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ ను కొట్టేసిన స్పీకర్
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కు భారీ ఊరట లభించింది. ఆయనపై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. సంజయ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అధికార కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ కు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన స్పీకర్.. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాజాగా సంజయ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.