ముఖ్య సమాచారం
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్‌లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
-
రూ.6 వేలు పెరిగిన బంగారం, రూ.14 వేలు పెరిగిన వెండి ధర
-
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
-
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
ప్రైవేటు బస్సు దగ్ధం.. ముగ్గురి మృతి,14మందికి గాయాలు
Updated on: 2026-01-22 09:47:00
టైరు పేలడంతో ప్రమాదం...కాలి బూడిదైన ప్రయాణికుల లగేజీ
ఆళ్లగడ్డ, నంద్యాల నేరవార్తలు, శిరివెళ్ల,: అర్ధరాత్రి సమయం.. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపుతప్పింది.. డివైడర్ మీదుగా దూసుకెళ్లి రోడ్డు అవతలివైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని దగ్ధమైంది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా...14మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న ఓ ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటాక నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు.
ప్రమాదం జరిగిన తర్వాత బస్సుకు మంటలు వ్యాపించారు. ఆ దారిన వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీల్లోంచి దూకేయడంతో పదిమందికిపైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. మంటలు విస్తరించడంతో లారీ కూడా కాలిపోయింది. బస్సు డ్రైవరుతో పాటు లారీ చోదకుడు, క్లీనర్ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రయాణికుల లగేజీ మొత్తం బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు.