ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సచివాలయాలకు పర్యవేక్షకులొస్తున్నారు!
Updated on: 2025-11-18 09:21:00
400 మంది డిప్యూటీ ఎంపీడీవోలకు త్వరలో బాధ్యతలు
మున్సిపల్, జిల్లా స్థాయిలోనూ అధికారుల నియామకం
అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో పర్యవేక్షకులొస్తున్నారు. తొలి దశలో మండల స్థాయిలో పర్యవేక్షక అధికారుల నియామకాన్ని త్వరలో చేపట్టనున్నారు. రెండో దశలో మున్సిపల్, జిల్లా స్థాయిలో అధికారులను కేటాయిస్తారు. ఈ నెలాఖరులోగా మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సచివాలయాలశాఖ యోచిస్తోంది. సచివాలయాలపై మండల స్థాయి పర్యవేక్షణాధికారులుగా రాష్ట్ర వ్యాప్తంగా 660 మంది డిప్యూటీ మండల పరిషత్ అధికారులను నియమించనున్నారు. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు, జడ్పీ, మండల కార్యాలయాల్లో పరిపాలన అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ డిప్యూటీ ఎంపీడీవోలుగా ఇటీవల పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. వీరందరి సేవలను డిప్యుటేషన్‌పై సచివాలయాలశాఖ వినియోగించుకోనుంది. పదోన్నతి పొందిన వారి జాబితా కొద్ది రోజుల క్రితం సచివాలయాలశాఖకు చేరింది.జిల్లా స్థాయి సచివాలయ పర్యవేక్షణాధికారులుగా జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులను నియమించనున్నారు. ఇందులో 70% పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, మరో 30% పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల అధికారులను డిప్యుటేషన్‌పై సచివాలయాల శాఖ తీసుకుంటుంది. నెలాఖరులోగా వీరి నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.