ముఖ్య సమాచారం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
-
ఏపీలో కొత్త శాఖ ఏర్పాటు.. కేబినెట్ ఆమోదం..
-
షుగర్ వ్యాధికి గుడ్ బై.! చైనాలో మరో అద్భుతం
-
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు..
-
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వాసుదేవరెడ్డి అరెస్టు
-
10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
-
ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
-
పాకిస్థాన్‌కు 'జల' గండం: రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
-
122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడి
-
ఇంటి వద్దకే వెళ్లి లైవ్ సర్టిఫికెట్ చేస్తున్న బొబ్బిలి మాజీ సైనికులు
క్షమించండి..మా సేవలు శాశ్వతంగానిలిపివేశాం: ఐబొమ్మ
Updated on: 2025-11-17 20:14:00
హైదరాబాద్: ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయిన నేపథ్యంలో ఐ బొమ్మ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సేవలను శాశ్వతంగా నిలిపివేశామని వెబ్సైట్లో వెల్లడించింది. కొత్త సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు రవిని శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఐ బొమ్మ, దాని అనుబంధంగా ఉన్న 65 వెబ్సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. “మీకు ఇటీవల మా గురించి తెలిసి ఉండొచ్చు. లేదంటే.. మొదటి నుంచి నమ్మకమైన అభిమానై ఉండొచ్చు. ఏదేమైనా.. మీ దేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపివేశామని చెప్పేందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం" అని ఐ బొమ్మ ప్రకటనలో పేర్కొంది. గత ఏడెనిమిదేళ్లుగా పైరసీ సినిమాలు, వెబసిరీస్ లకు ఐ బొమ్మను వేదికగా మార్చిన ఇమ్మడి రవి (40)ని శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్ పల్లిలో అరెస్ట్ చేశారు. ఇతడు నివసిస్తున్న అపార్ట్మెంట్లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్ఫోన్లను గుర్తించినట్టు సమాచారం. నిందితుడిని బషీర్‌బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)కు తరలించి కీలక సమాచారం సేకరించారు. అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.