ముఖ్య సమాచారం
-
హిమాచల్‌లో జల ప్రళయం.. 37 మంది బలి, రూ.400 కోట్ల ఆస్తి నష్టం!
-
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
-
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
-
ట్రంప్ కు భారీ విజయం.. 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం
-
ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం... ముగ్గురు సజీవ దహనం
-
పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా.. 65 మంది గల్లంతు
-
మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు
-
పెనమలూరు: యువకుడి వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం
-
అనకాపల్లి జిల్లాలో విషాదం...జాలరిని సముద్రంలోకి లాక్కెళ్లిన 100 కిలోల చేప..
-
జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ
ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం... ముగ్గురు సజీవ దహనం
Updated on: 2025-07-04 07:32:00

ఖమ్మం - వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న రెండు లారీలు అదుపుతప్పి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన మరిపెడ మండలం శివారులోని కుడియాతండా సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... ఖమ్మం-వరంగల్ హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఓ లారీ క్యాబిన్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో క్యాబిన్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ బయటకు వచ్చే అవకాశం లేక మంటల్లోనే కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.