ముఖ్య సమాచారం
-
ఏపీ ఇంటర్ పరీక్షల విధానంలో భారీ మార్పులు.. నెల ముందుగానే షెడ్యూల్
-
అల్పపీడనం ప్రభావం.. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు..!!
-
జూరాల ప్రాజెక్ట్ ఎగువ నుంచి భారీగా కొనసాగుతున్న వరద
-
రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని
-
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం!
-
సెప్టెంబరు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
-
ముంబైకి రిలయన్స్ డబుల్ గిఫ్ట్: రెండు భారీ ప్రాజెక్టులు ప్రకటించిన నీతా అంబానీ
-
రెండు_అల్పపీడనాలు
-
నాలుగో రోజుకు చేరుకున్న గణపతి నవరాత్ర మహోత్సవాలు... శ్రీ వీర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు
-
అల్లు అరవింద్ కు మాతృ వియోగం
మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. రోడ్డున పడ్డ 9వేల మంది ఉద్యోగులు
Updated on: 2025-07-03 14:44:00

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వేలాది మందికి లేఆఫ్ నోటీసులు జారీ చేస్తునట్లు ప్రకటించింది.దాదాపు 4 శాతం కంటే తక్కువ ఉద్యోగులపై ప్రభావం చూపనుందని తెలిపింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం దాదాపు 9 వేల మందికి లేఆఫ్‌లు ఇచ్చినట్లు సమాచారం. జూన్ 2024 నాటికి 2.28 లక్షల మంది ఉద్యోగులు మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులను మొదలుపెట్టిన టెక్ దిగ్గజం.. ఈ ఏడాది మే నెలలో 6 వేల మందికి లేఆఫ్‌లు ప్రకటించింది. తాజాగా మరోసారి పెద్దఎత్తున తొలగింపునకు సిద్ధమైంది. తాజా నిర్ణయంతో మొత్తం సిబ్బందిలో నాలుగు శాతం.. అంటే దాదాపు 9100 మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు అంచనా.