ముఖ్య సమాచారం
-
మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి..
-
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
-
ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
-
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
-
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు
-
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడిగింపు
-
భారత్- చైనా సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి: జిన్ పింగ్ తో భేటీలో మోదీ వ్యాఖ్య
-
గ్రౌండ్ బుకింగ్ ఉండే బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
-
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
సెప్టెంబరు 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Updated on: 2025-08-30 18:51:00

నర్సీపట్నం: తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమానికి తొలిరోజు సీఎం చంద్రబాబు, లోక్సభస్పీకర్ హాజరవుతారని, ముగింపు రోజున గవర్నర్ హాజరుకానున్నారని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు శ్రీవారి దర్శనం కల్పించించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు 18 నుంచి శాసనసభ సమావేశాలు జరగుతాయని, ఈమేరకు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించినట్టు పేర్కొన్నారు.