ముఖ్య సమాచారం
-
కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో నిరాశ
-
ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్ అథారిటఏర్పాటు.
-
తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు..
-
ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: తెలంగాణ హైకోర్టు.
-
185 ఏళ్ల పోస్టు బాక్స్ కు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచితాళం..
-
మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి..
-
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
-
ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
-
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
-
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
Updated on: 2025-08-31 14:29:00

తెలంగాణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించే కీలక సవరణ బిల్లులకు రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదం తెలిపింది. తీవ్ర వాదోపవాదాల నడుమ తెలంగాణ మున్సిపాలిటీల (మూడవ సవరణ) బిల్లు-2025, తెలంగాణ పంచాయతీరాజ్ (మూడవ సవరణ) బిల్లు-2025లను సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.అసెంబ్లీ సమావేశాల రెండో రోజున ప్రభుత్వం ఈ రెండు బిల్లులను సభ ముందుకు తెచ్చింది. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించి, బీసీలకు 42 శాతం కోటా కల్పించడమే ఈ బిల్లుల ముఖ్య ఉద్దేశం.
చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పంచాయతీరాజ్ చట్టం-2018, మున్సిపాలిటీల చట్టం-2019 వల్లే రిజర్వేషన్లు 50 శాతానికి మించలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బీసీల సాధికారతకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.