ముఖ్య సమాచారం
-
కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో నిరాశ
-
ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్ అథారిటఏర్పాటు.
-
తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు..
-
ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: తెలంగాణ హైకోర్టు.
-
185 ఏళ్ల పోస్టు బాక్స్ కు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచితాళం..
-
మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి..
-
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
-
ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
-
ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
-
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
Updated on: 2025-09-01 11:17:00

చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశ సందర్భంలో ఆసక్తికర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుసుకోగానే హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు.అనంతరం ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ చైనాలోని టియాంజిన్‌లో చర్చలు జరిపారు.పుతిన్‌తో భేటీ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో చమురు కొనుగోళ్లను బూచీగా చూపి భారత దిగుమతులపై 50% సుంకాలను విధించిన నేపథ్యంలో, ఇద్దరు నాయకుల మధ్య కీలక సమావేశం జరిగింది.జూలైలో, ఉక్రెయిన్‌పై శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే రష్యాపై 100% సుంకాలను విధించాలని కూడా ట్రంప్ బెదిరించారు. రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై జరిమానాలు కొనసాగిస్తానని కూడా ఆయన చెప్పారు. ఉక్రెయిన్ పరిస్థితిని చర్చించడానికి ట్రంప్, పుతిన్ అలాస్కాలో కలిసిన దాదాపు వారం రోజల తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ మధ్య తాజా సమావేశం జరిగింది.