ముఖ్య సమాచారం
-
కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో నిరాశ
-
ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్ అథారిటఏర్పాటు.
-
తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు..
-
ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: తెలంగాణ హైకోర్టు.
-
185 ఏళ్ల పోస్టు బాక్స్ కు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచితాళం..
-
మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి..
-
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
-
ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
-
ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
-
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భారత్- చైనా సంబంధాలు పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి: జిన్ పింగ్ తో భేటీలో మోదీ వ్యాఖ్య
Updated on: 2025-08-31 14:37:00

దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. తియాజింగ్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. దీనికి ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోదీ భేటీ అయ్యారు. అమెరికా సుంకాల బాదుడు నేపథ్యంలో వీరి భేటీ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చైనాతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. గతేడాది రష్యాలోని కజన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్‌పింగ్ జరిగిన సమావేశం గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించారు. నాడు తమ భేటీ ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు బాటలు వేసిందన్నారు. భారత్- చైనా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొందన్నారు.
కైలాశ్ మానససరోవర్ యాత్ర కూడా తిరిగి ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య సహకారంతో దాదాపు 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.
పరస్పర విశ్వాసం, గౌరవంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు నిశ్చయించుకున్నామన్నారు. ఈ సందర్భంగా చైనాలో పర్యటించేందుకు, ఎస్సీవో సదస్సుకు తనను ఆహ్వానించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.