ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
నాలుగో రోజుకు చేరుకున్న గణపతి నవరాత్ర మహోత్సవాలు... శ్రీ వీర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారు
Updated on: 2025-08-30 09:32:00
గుడివాడ పట్టణంలో ప్రాముఖ్యత కలిగిన మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్ర మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. శనివారం శ్రీ వీర గణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శివ జ్యోతి నృత్యాలయం కళాకారులు నిర్వహించిన కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారులకు దేవస్థానం చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు దేవదాయ శాఖ సర్టిఫికెట్లను అందించారు.
ఉత్సవాల ఐదో రోజు ఆదివారం శ్రీ పంచముఖ అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.