ముఖ్య సమాచారం
-
జలకళ.. నిండుగా జలాశయాలు
-
ఉక్రెయిన్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరా నిలిపివేత
-
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్ పేరు ప్రకటించిన టీవీకే పార్టీ
-
ఏపీలో జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
-
హిమాచల్‌లో జల ప్రళయం.. 37 మంది బలి, రూ.400 కోట్ల ఆస్తి నష్టం!
-
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
-
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
-
ట్రంప్ కు భారీ విజయం.. 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను అమెరికా పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం
-
ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం... ముగ్గురు సజీవ దహనం
-
పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా.. 65 మంది గల్లంతు
జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ
Updated on: 2025-07-03 13:41:00

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈ రోజు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి బుధవారం విడుదలైన ఆయన, మరుసటి రోజే జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ, కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్.. వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు.