ముఖ్య సమాచారం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
-
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్
-
చికెన్ కిలో రూ.800.. భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి
-
భారత్‌కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
-
జైల్లో వంశీకి అస్వస్థత
-
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
-
50 శాతం రాయితీపై పశువుల దాణా
-
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
-
450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
-
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు : రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ
చికెన్ కిలో రూ.800.. భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి
Updated on: 2025-05-04 09:45:00

భారత్‌తో కాదు..ముందు నిత్యావసరాల రేట్లతో ఫైట్ చేయాలి పాకిస్తాన్. ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు అంటూ పాక్ పౌరులు వాపోతున్నారు. ఆకలిరాజ్యంలో అల్లాడిపోతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్న పాక్.. భారత్‌కు సవాళ్లు విసురుతూ నవ్వులపాలవుతోంది.. డజను గుడ్లు రూ. 332, చికెన్ కిలో రూ. 798.89, కిలో బియ్యం రూ. 339.56, లీటర్ పాలు రూ. 224, టమాటా కిలో రూ. 150, ఆలూ కిలో రూ. 105, అర కిలో బ్రెడ్ రూ. 161.28 .. ఈ రేట్లు ఎక్కడో కాదు.. పక్క దేశం.. పాకిస్తాన్‌లోని నిత్యావసరాల ధరలు.. పాకిస్తానీ రూపాయల ప్రకారం ఉన్న ఈ ధరలు ఆ దేశానికి దడ పుట్టిస్తున్నాయి. ఆకలి రాజ్యానికి కేరాఫ్ అడ్రస్‌లా మారింది మన పొరుగు దేశం. ఇక భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో…2 నెలలకు సరిపడేలా సరుకులు నిల్వ చేసి ఉంచుకోమని తమ పౌరులకు, మరీ ముఖ్యంగా పీవోకే వాసులకు చెబుతోంది పాకిస్తాన్.