ముఖ్య సమాచారం
-
పాక్‌కు మరో షాక్.. డ్యామ్ గేట్లు క్లోజ్ చేసిన భారత్
-
పెనమలూరు: ఆటోపై కూలిన భారీ వృక్షం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
-
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్
-
చికెన్ కిలో రూ.800.. భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి
-
భారత్‌కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
-
జైల్లో వంశీకి అస్వస్థత
-
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
-
50 శాతం రాయితీపై పశువుల దాణా
-
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
50 శాతం రాయితీపై పశువుల దాణా
Updated on: 2025-05-04 09:04:00

అమరావతి: రాష్ట్రంలోని పశుపోషకులకు 50 శాతం రాయితీపైసమీకృత దాణా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిలో రూ.22.11కు కొని రైతు సేవాకేంద్రాలు, పశు వైద్యశాలల ద్వారా రూ.11.10కే పంపిణీ చేయనుంది. 20 శాతం ప్రొటీన్ కలిగిన ఈ దాణాను తొలిసారి అందిస్తోంది. తెల్లరేషన్ కార్డు కలిగిన పశుపోషకులు ఈ లబ్ది పొందేందుకు అర్హులు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రెండు పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకుగానూ విడతల వారీగా 450 కిలోల దాణాను రాయితీపై పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 లక్షల మంది పశుపోషకులకు లబ్ధి కలిగించేలా రూ.69 కోట్ల వ్యయంతో 31,067 టన్నుల దాణా పంపిణీకి పశు సంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. 50 కిలోల పరిమాణం కలిగిన దాణా సంచిని రూ.1,100కు కొని.. రూ.555కే పశుపోషకు లకు అందజేస్తారు. ఈ రాయితీ వల్ల ఆర్థికంగా అదనపు భారం పడుతున్నప్ప టికీ వేసవిలో పశుగ్రాసం కొరతను అధిగమించి, నిలకడగా పాడి ఉత్పత్తులు పొందేందుకు, పశువుల విక్రయాలను నిలువరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పశు సంవర్ధక శాఖ సంచాలకుడు టి. దామోదర్‌నాయుడు కోరారు.