ముఖ్య సమాచారం
-
పాక్‌కు మరో షాక్.. డ్యామ్ గేట్లు క్లోజ్ చేసిన భారత్
-
పెనమలూరు: ఆటోపై కూలిన భారీ వృక్షం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
-
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్
-
చికెన్ కిలో రూ.800.. భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి
-
భారత్‌కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
-
జైల్లో వంశీకి అస్వస్థత
-
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
-
50 శాతం రాయితీపై పశువుల దాణా
-
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
భారత్‌కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
Updated on: 2025-05-04 09:32:00

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గత నెలలో జరిగిన ఘోర ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాలో పాకిస్థాన్ రాయబారి ముహమ్మద్ ఖలీద్ జమాలి భారత్‌కు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ భారత్ తమ దేశంపై దాడికి పాల్పడితే, అణ్వాయుధాలతో సహా తమ వద్ద ఉన్న ‘పూర్తిస్థాయి శక్తి’ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జమాలి మాట్లాడుతూ భారత్ తమ దేశంలోని కొన్ని ప్రాంతాలపై దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, త్వరలోనే ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘భారత మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు, ఆ దేశం నుంచి వెలువడుతున్న బాధ్యతారహితమైన ప్రకటనలు మమ్మల్ని ఈ నిర్ణయానికి పురికొల్పాయి. పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలపై దాడి చేయాలని నిర్ణయించినట్టు కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. దీనివల్ల దాడి జరగబోతోందని, అది ఆసన్నమైందని మేము భావిస్తున్నాం’ అని జమాలి పేర్కొన్నారు.సంఖ్యాబలం గురించి చర్చల్లోకి తాము వెళ్లదల్చుకోలేదని, భారత్ విషయంలో సంప్రదాయ, అణుశక్తితో కూడిన పూర్తిస్థాయి శక్తిని ఉపయోగిస్తామని ఆయన నొక్కి చెప్పారు