ముఖ్య సమాచారం
-
పాక్‌కు మరో షాక్.. డ్యామ్ గేట్లు క్లోజ్ చేసిన భారత్
-
పెనమలూరు: ఆటోపై కూలిన భారీ వృక్షం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
-
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్
-
చికెన్ కిలో రూ.800.. భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి
-
భారత్‌కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
-
జైల్లో వంశీకి అస్వస్థత
-
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
-
50 శాతం రాయితీపై పశువుల దాణా
-
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు : రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ
Updated on: 2025-05-03 22:58:00

ఆమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. సోమవారం, మంగళవారం రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు 41.5 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడేందుకు అవకాశం ఉందన్నారు. ఇవాళ తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా బోట్లగూడూరులో 41.5 డిగ్రీలు, పల్నాడు జిల్లా క్రోసూరులో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు.