ముఖ్య సమాచారం
-
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
-
మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్
-
చికెన్ కిలో రూ.800.. భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది మరి
-
భారత్‌కు పాక్ మరోమారు బహిరంగ అణు హెచ్చరిక.. తీవ్రరూపం దాల్చుతున్న ఉద్రిక్తతలు
-
జైల్లో వంశీకి అస్వస్థత
-
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదు
-
50 శాతం రాయితీపై పశువుల దాణా
-
ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
-
450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
-
ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు : రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ
భారతీయుడ్ని ఉరితీసిన కువైట్ అధికారులు
Updated on: 2025-05-03 10:07:00

యజమాని హత్య కేసులో దోషిగా తేలిన భారతీయ వంటమనిషికి కువైట్‌లో మరణశిక్ష విధించారు. గుజరాత్‌లోని కపడ్‌వంజ్‌కు చెందిన 38 ఏళ్ల ముస్తకీం భాతియారాకు ఏప్రిల్ 28న ఈ శిక్షను అమలు చేసినట్లు తెలిసింది. అనంతరం అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించి, బుధవారం స్వస్థలంలో ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ఖననం చేశారు. లభించిన సమాచారం ప్రకారం, ముస్తకీం సుమారు ఏడేళ్లుగా కువైట్‌లో రెహానా ఖాన్ అనే మహిళ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. 2019లో యజమాని రెహానా ఖాన్‌తో ముస్తకీంకు వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి, తీవ్ర ఘర్షణకు దారితీయడంతో ముస్తకీం ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత యజమాని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కువైట్ పోలీసులు ముస్తకీంను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం 2021లో న్యాయస్థానం అతన్ని దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది.