ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
విద్య అంధకారాన్ని తొలగించి వెలుగునిస్తుంది
Updated on: 2024-06-09 19:30:00

విద్య మనిషిలోని అంధకారాన్ని తొలగించి భావి భవిష్యత్తుకు వెలుగును ప్రసాదిస్తుందని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్తపేట మండలశాఖ ప్రతినిధులు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు ఆదివారం 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన ఎస్సీ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించారు. మండలశాఖ అధ్యక్షులు నల్లా సత్యానంద కుమార్ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షులు బత్తుల నకులరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు సుమారు 75 వేల ఖరీదైన ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ బృహత్ కార్యక్రమం వెనుక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అందించిన స్ఫూర్తి ఎంతగానో ఉందని, విద్యార్థులందరూ భవిష్యత్ తరంలో విద్యలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా కొత్తపేట మండల శాఖ మాజీ అధ్యక్షులు సబ్బతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆలోచనలతో ప్రతి విద్యార్థి నడుచుకోవాలని కేవలం చదువు ద్వారానే లౌకిక దేశమైన భారతదేశానికి రాజ్యాంగం రాయగలిగే శక్తి సంపాదించారన్నారు.
ఈరోజు ప్రతి దేశంలో ఆయన అందించిన అనేక గ్రంథాలను అనుసరిస్తున్నారని విద్యార్థిని విద్యార్థులందరూ ఆయన బాటలో నడుస్తూ ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దారా శ్రీకాంత్, ఆర్థిక కార్యదర్శి పుల్లెల భాస్కర్ శాస్త్రి, జిల్లా ఉపాధ్యక్షులు మానేపల్లి రవి, బత్తుల రమేష్ బాబు, నేరేడుమిల్లి సత్యనారాయణ, జిల్లా ఆర్థిక కార్యదర్శి సాధనాల సత్యనారాయణ, కోట సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గెడ్డం ప్రదీప్, మండల శాఖ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.వి.వి సత్యనారాయణ, మండల శాఖ బాధ్యులు కేపి సిహెచ్ సూర్యారావు, వరసాల బాలకృష్ణ, అంబటి జీవరత్నం, కప్పల నాగేశ్వరరావు, బొక్కే సువర్ణ, రాపాక అన్నే మార్త, మెండి ఏసేబు, పుల్లెల వెంకటేష్, మామిడికుదురు మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూపతి మనోహర్ రాజు, కారుపల్లి కళ్యాణ్ బాబు, మండలశాఖ కార్యవర్గ సభ్యులు, బహుమతి గ్రహీతలైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.