ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
బీసీలను మభ్యపెడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు
Updated on: 2023-11-22 12:35:00

ఓట్ల కోసం బీసీలకు ఇది చేస్తాం అది చేస్తాం అని మభ్యపెట్టటమే తప్పా జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు బీసీలకు ఒరుగపెట్టింది ఏమి లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ లు అన్నారు.కరీంనగర్ లోని జ్యోతినగర్ లో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ నియోజవర్గం లో రెండు సీట్లు బీసీలకు ఇస్తామని మోసం చేసిందని అలాగే బీసీలకు పాలన చేతకాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనడం బీసీలను అవమాన పరడమే అని ఆ వాక్యాలను బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. బీజేపీ పార్టీ తాము అధకారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారని కానీ బీసీల జనగణన జరిపి చట్ట సభల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదని అన్నారు.బీసీ ముఖ్యమంత్రి వల్ల ఏమి ప్రయోజనమని అధికారం అంతా కేంద్ర అధిష్టానం చేతిలో ఉంటుందని తెలిపారు.కాబట్టి కరీంనగర్ లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించి,బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన మరియు నియోజక వర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ కు ఓటు వేయాలని బీసీ విద్యార్థి సంఘం పట్టణ అధ్యక్షుడు అజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం చేశారు.