ముఖ్య సమాచారం
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
-
మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట
-
ఆస్ట్రేలియా తొలి రాకెట్ ప్రయోగం విఫలం..
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
Updated on: 2025-08-01 08:02:00

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో మూడు పోలీసు కేసులు నమోదయ్యాయి. జగన్ పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి ప్రసన్న ఇంటికెళ్లే రోడ్డు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను వైసీపీ నాయకులు, కార్యకర్తలు లాగిపడేసి.. పరుగులు తీశారు. దాంతో కావలికి చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య బారికేడ్ కింద పడిపోవడంతో చేయి విరిగింది. ఈ ఘటనలో ప్రసన్న, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, పాతపాటి ప్రభాకర్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పర్యటన సందర్భంగా రోడ్డుపై ధర్నా చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించినందుకు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మరికొందరిపై దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్ ర్యాలీ చేపట్టినందుకు దర్గామిట్ట పోలీసులు మరో కేసు నమోదు చేశారు.