ముఖ్య సమాచారం
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
-
మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట
-
ఆస్ట్రేలియా తొలి రాకెట్ ప్రయోగం విఫలం..
ఆస్ట్రేలియా తొలి రాకెట్ ప్రయోగం విఫలం..
Updated on: 2025-07-31 15:52:00

ఆస్ట్రేలియా అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా భావించిన తొలి దేశీయ రాకెట్ ప్రయోగం విఫలమైంది. గిల్మౌర్ స్పేస్ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన 'ఎరిస్' రాకెట్ ను బుధవారం ఉదయం ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని బోవెన్ పట్టణం సమీపంలోని స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించారు. కానీ ఇది కొన్ని సెకన్ల వ్యవధిలోనే నేలకూలింది. చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లడానికి ఉద్దేశించిన ఈ 23 మీటర్ల రాకెట్, లాంచింగ్ టవర్ కంటే కొద్ది ఎత్తుకు మాత్రం చేరగలిగింది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమైంది. తొలిసారిగా ఆస్ట్రేలియా తయారుచేసి, ఆస్ట్రేలియా గడ్డపై నుంచి తొలిసారి ప్రయోగించిన ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఇదే కావడం గమనార్హం. ఈ విఫల ప్రయోగానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.