ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పీఎం కిసాన్ నిధుల విడుదల..
Updated on: 2025-08-02 15:28:00

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' పథకంలో భాగంగా 20వ విడత ఆర్థిక సాయాన్ని శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని, వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ విడతలో భాగంగా సుమారు 9.7 కోట్ల మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,500 కోట్లు జమ అయ్యాయి
రైతులకు పంట పెట్టుబడి ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏటా రూ.6,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో, అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. తాజా విడుదలతో అన్నదాతలకు వ్యవసాయ పనుల కోసం కీలకమైన పెట్టుబడి సాయం అందినట్లయింది.