ముఖ్య సమాచారం
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
-
మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట
-
ఆస్ట్రేలియా తొలి రాకెట్ ప్రయోగం విఫలం..
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు
Updated on: 2025-07-31 15:45:00

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో సంజయ్‌పై ఏపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఈ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దాంతో హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ ఎన్వీఎన్ భట్టి, జస్టిస్ అమానుతుల్లా ధర్మాసనం ఈ రోజు తీర్పును వెల్లడించింది. ఇక, విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు తీర్పుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్‌ను పూర్తి చేసినట్టు ఉందని మండిపడింది.