ముఖ్య సమాచారం
-
పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ నిష్క్రమణ.. 25 ఏళ్ల బంధం తెగింది!
-
విజయవాడ హైవేపై ప్రమాదం.. ఒకేసారి ఢీకొన్న మూడు కార్లు
-
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
-
జలకళ.. నిండుగా జలాశయాలు
-
ఉక్రెయిన్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరా నిలిపివేత
-
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్ పేరు ప్రకటించిన టీవీకే పార్టీ
-
ఏపీలో జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
-
హిమాచల్‌లో జల ప్రళయం.. 37 మంది బలి, రూ.400 కోట్ల ఆస్తి నష్టం!
-
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
-
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
విజయవాడ హైవేపై ప్రమాదం.. ఒకేసారి ఢీకొన్న మూడు కార్లు
Updated on: 2025-07-04 19:24:00

యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం రెడ్డిబావి వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశారు. దీంతో, ఆ కారు వెనుక వస్తున్న మరో కారు ఢీకొట్టింది. దాంతో రెండో కారును వెనుకగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్ల ముందు భాగాలు, బంపర్లు దెబ్బతిన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆకస్మికంగా బ్రేకుల వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు