ముఖ్య సమాచారం
-
పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ నిష్క్రమణ.. 25 ఏళ్ల బంధం తెగింది!
-
విజయవాడ హైవేపై ప్రమాదం.. ఒకేసారి ఢీకొన్న మూడు కార్లు
-
శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
-
జలకళ.. నిండుగా జలాశయాలు
-
ఉక్రెయిన్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరా నిలిపివేత
-
సీఎం అభ్యర్థిగా హీరో విజయ్ పేరు ప్రకటించిన టీవీకే పార్టీ
-
ఏపీలో జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
-
హిమాచల్‌లో జల ప్రళయం.. 37 మంది బలి, రూ.400 కోట్ల ఆస్తి నష్టం!
-
చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన భారత స్టార్ గుకేశ్
-
గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ.. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయం
జపాన్ను వణికిస్తున్న సునామీ జోస్యం
Updated on: 2025-07-03 10:05:00

జపాన్‌లో ఓ కామిక్ పుస్తకం (మాంగా) సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. "నేను చూసిన భవిష్యత్తు" అనే పేరుతో వచ్చిన ఈ మాంగాలో పేర్కొన్న ఓ జోస్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జులై 5, 2025న పెను సునామీ జపాన్ను అతలాకుతలం చేస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు, పర్యాటకులు భయాందోళనలకు గురవుతున్నారు. రియో తత్సుకి అనే రచయిత్రి ఈ మాంగాను 2021లో రాశారు. గతంలో ఆమె 2011 నాటి భారీ భూకంపాన్ని ఊహించారని ప్రచారం జరగడంతో, తాజా జోస్యానికి ప్రాధాన్యం పెరిగింది. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో భారీ పగుళ్లు ఏర్పడి 2011 నాటి సునామీ కన్నా మూడు రెట్లు పెద్ద విపత్తు సంభవిస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ ప్రచారం హాంగ్‌కాంగ్, తైవాన్, చైనా వంటి తూర్పు ఆసియా దేశాల్లో వేగంగా వ్యాపించడంతో, జపాన్‌కు పర్యాటకుల రాకపై తీవ్ర ప్రభావం పడుతోంది.