ముఖ్య సమాచారం
-
అరబ్ దేశాలను సాయం కోరుతున్న పాకిస్థాన్!
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
Updated on: 2025-05-02 20:49:00

అర్జెంటీనా, చిలీ తీర ప్రాంతంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఉషుయాకి దక్షిణంగా 219 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. తీవ్ర భూకంపం అనంతరం రెండుసార్లు ప్రకంపనలు కూడా వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలిసింది.
సునామీ హెచ్చరికలు.. ..తీవ్ర భూకంపం నేపథ్యంలో కొన్ని నిమిషాల్లో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చిలీలోని మాగెల్లాన్ తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. అంటార్కిటిక్ భూభాగంలోని బీచ్లన్నీ ఖాళీ చేయాలని సూచించింది. తాజా పరిణామంపై చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బొరిక్ స్పందించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. తీర ప్రాంతాన్ని ఖాళీ చేయడంతోపాటు అధికారులు సిద్ధంగా ఉండటమే తమ తక్షణ కర్తవ్యమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.