ముఖ్య సమాచారం
-
అరబ్ దేశాలను సాయం కోరుతున్న పాకిస్థాన్!
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
Updated on: 2025-05-02 19:27:00

“అమరావతి..” ఐదుకోట్ల మంది ఆంధ్రులకు రాజధాని. అయితే భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అదొక “ఎమోషన్”. చంద్రబాబు పిలుపుతో రాజధాని కోసం కేవలం 58 రోజుల వ్యవధిలోనే ఏకంగా 34 వేలకు పైగా ఎకరాల్ని భూసమీకరణలో ఇచ్చారు. 29 గ్రామాల ప్రజలు. 2019లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తేవడంతో.. రాజధాని రైతులు అలుపెరగని పోరాటం చేశారు. ఏకంగా 16 వందల 31 రోజుల పాటు సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగించారు. చివరికి వారి పోరాటం ఫలించింది. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ చేతుల మీదుగానే మళ్లీ గ్రాండ్గా రీస్టార్ట్ అయింది.
ఈ సందర్భంగా రాజధాని రైతుల సాగించిన పోరాటాన్ని చంద్రబాబు సహా నేతలంతా ప్రశంసించారు. ఐదేళ్లపాటు అమరావతి విధ్వంసం చూసిన రైతులు ఇకపై అభివృద్ధి చూస్తారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 39 వేల ఎకరాలు ఇచ్చారని..వారి పోరాటం వల్లే అమరావతి నిలబడిందన్నారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.