ముఖ్య సమాచారం
-
అరబ్ దేశాలను సాయం కోరుతున్న పాకిస్థాన్!
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
Updated on: 2025-05-02 19:35:00

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేరళలోని విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ-ఆటోమేటెడ్ లోతైన సముద్ర ఓడరేవు. అదానీ గ్రూప్ నిర్మించిన ఈ పోర్టు, AI- ఆధారిత నౌక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంది.ఈ పోర్టుల ఇండియాను దక్షిణాసియాలో కొత్త సముద్ర ద్వారంగా నిలపనుంది. కొలంబో, దుబాయ్ వంటి ప్రధాన ఓడరేవులకు పోటీగా దీన్ని నిర్మించారు. దాదాపు 20 మీటర్ల సహజ లోతు, ప్రపంచ షిప్పింగ్ మార్గాలకు సమీపంలో ఉండటం వల్ల పెద్ద కంటైనర్ నౌకలకు అనువుగా దీన్ని నిర్మించారు. ఈ పోర్టులో గతేడాది జూలైలోనే ట్రయల్ రన్ ప్రారంభించారు. అధికారిక ప్రారంభానికి ముందు 285 కంటే ఎక్కువ నౌకలు డాకింగ్ చేశాయి. ఇది దేశంలో మొట్టమొదటి సెమీ-ఆటోమేటెడ్ పోర్టు.