ముఖ్య సమాచారం
-
అరబ్ దేశాలను సాయం కోరుతున్న పాకిస్థాన్!
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
Updated on: 2025-05-02 19:14:00

భారత్ నుంచి దాడులు జరగవచ్చనే ఆందోళనల నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి స్థానిక అధికార యంత్రాంగం శుక్రవారం దాదాపు 1000కి పైగా మదర్సాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కనీసం 10 రోజుల పాటు ఈ మదర్సాలకు సెలవులు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడులకు దిగవచ్చని, ముఖ్యంగా గతంలో ఉగ్రవాద స్థావరాలుగా ఆరోపణలు ఎదుర్కొన్న మదర్సాలను లక్ష్యంగా చేసుకోవచ్చని పాకిస్థాన్ భయపడుతున్నట్లు సమాచారం. 2019లో బాలాకోట్‌పై భారత వైమానిక దళం జరిపిన దాడుల తరహాలోనే ఇప్పుడు కూడా దాడులు జరగవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి, ప్రభుత్వ ఆదేశాల మేరకే మదర్సాలను మూసివేసినట్లు ధృవీకరించారు.