ముఖ్య సమాచారం
-
అరబ్ దేశాలను సాయం కోరుతున్న పాకిస్థాన్!
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
Updated on: 2025-05-02 19:08:00

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు నోటీసులు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, దీనిపై వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది.
గతంలో సరైన పత్రాలు లేవన్న కారణంతో నోటీసుల జారీకి నిరాకరించిన కోర్టు, తాజాగా ఈడీ అభ్యర్థన మేరకు చర్యలు చేపట్టింది. చార్జిషీట్‌పై విచారణకు ముందు నిందితుల వాదనలు వినాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేశారు.