ముఖ్య సమాచారం
-
ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేకశిబిరాలు
-
అర్జెంటీనాలో 7.4 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
-
విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తిచేస్తాం.. ఇది రాజధాని రైతుల విజయం : చంద్రబాబు
-
ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు: ప్రధాని మోదీ
-
పీఓకేలో 1000కి పైగా మదర్సాలు మూసివేత
-
పహల్గామ్ దాడి.. ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని పీవోకేలో ప్రజలకు అలర్ట్
-
సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు
-
లాభాల్లో ముగిసిన సెన్సెక్స్... ఫ్లాట్ గా నిఫ్టీ
నేడు రాష్ట్ర ప్రజలు గర్వపడే రోజు: సీఎం చంద్రబాబు
Updated on: 2025-05-02 11:03:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఈ పనులను ప్రారంభించడానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నేడు రాష్ట్ర ప్రజలు గర్వపడే, ముఖ్యమైన రోజు అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. "ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమైన, ముఖ్యమైన రోజు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన ప్రజల రాజధాని అభివృద్ధిని తిరిగి ప్రారంభించడానికి అమరావతికి వస్తున్నారు. అమరావతి మన ఉమ్మడి ఆశలు, కలలకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ పునఃప్రారంభం మన రాష్ట్ర వృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది" అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.