ముఖ్య సమాచారం
-
నేడు రాష్ట్ర ప్రజలు గర్వపడే రోజు: సీఎం చంద్రబాబు
-
పాక్ తన గగనతలాన్ని ఏడాదిపాటు మూసేస్తే.. ఎయిరిండియాకు రూ.5,081 కోట్ల నష్టం!
-
తెరచుకున్న కేదార్ నాథ్ తలుపులు
-
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
హైదరాబాద్‌లో మరో పెద్ద జూ పార్క్.. ఏకంగా 200 ఎకరాల్లో
-
భారత్‌లో కాగ్నిజెంట్ నియామకాలు: 20,000 ఫ్రెషర్లకు అవకాశం
-
'వేవ్స్' సమ్మిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా 'రామోజీ' స్టాల్
-
అటారీ-వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేత
-
భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం: ఫరూక్ అబ్దుల్లా
-
బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హైఅలర్ట్
ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ
Updated on: 2025-05-01 07:49:00

ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వెంచర్లలో(ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌లు), సీఆర్డీఏ ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలపై భారాన్ని తగ్గిస్తూ మునిసిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆమేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఇకపై ప్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటును రెండుగా విడగొట్టాలని పేర్కొంది. బేస్ ప్రైస్... అమ్మకపు ధరలో 60 శాతం, డెవల్‌పమెంట్ చార్జీలు... మిగిలిన 40 శాతం... వేరు వేరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేయాలి. బేస్ ప్రైస్‌పై 7.5 శాతం, డెవల్‌పమెంట్ చార్జీలపై 0.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీ వసూలు చేస్తారు. దీంతో కొనుగోలుదారు ప్లాట్ ధరపై 7.5 శాతం చెల్లించాల్సిన అవసరం లేదు.