ముఖ్య సమాచారం
-
డాక్టర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ
-
నేడు రాష్ట్ర ప్రజలు గర్వపడే రోజు: సీఎం చంద్రబాబు
-
పాక్ తన గగనతలాన్ని ఏడాదిపాటు మూసేస్తే.. ఎయిరిండియాకు రూ.5,081 కోట్ల నష్టం!
-
తెరచుకున్న కేదార్ నాథ్ తలుపులు
-
ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
హైదరాబాద్‌లో మరో పెద్ద జూ పార్క్.. ఏకంగా 200 ఎకరాల్లో
-
భారత్‌లో కాగ్నిజెంట్ నియామకాలు: 20,000 ఫ్రెషర్లకు అవకాశం
-
'వేవ్స్' సమ్మిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా 'రామోజీ' స్టాల్
-
అటారీ-వాఘా సరిహద్దు పూర్తిగా మూసివేత
-
భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం: ఫరూక్ అబ్దుల్లా
రూ.500 నోటు రద్దు? ఇకపై ATMలలో రూ.200, రూ100 నోట్లే.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!
Updated on: 2025-05-01 07:27:00

దేశంలోని 75 శాతం ATMలలో సెప్టెంబర్ 2025 నాటికి 100, 200 రూపాయల నోట్లను అప్లోడ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని బ్యాంకులను ఆదేశించింది.
RBI చేసిన ఈ సూచన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.500 నోటుపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో రూ.500 రూపాయల నోటును కూడా రద్దు చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
బ్యాంకింగ్ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వని రాణా ప్రకారం.. దేశంలోని ఏటీఎంలద్వారా ఉపసంహరించుకునే నగదులో రూ.100, రూ.200 నోట్లపై ఆధారపడటాన్ని పెంచాలని ఆర్బిఐ కోరుకుంటోంది. అలాగే, నగదు కోసం రూ.500 నోటుపై ఆధారపడటాన్ని తగ్గించాలని అనుకుంటోంది. పెద్ద నోట్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే రూ.2000 నోట్లను చెలామణి నుండి తొలగించింది. రూ.2000 నోటును చెలామణి నుండి తొలగించినట్లే, రూ.500 నోటును కూడా చెలామణి నుండి తొలగించబోతున్నారా? అంటే దీనికి రిజర్వ్ బ్యాంక్ మాత్రమే సమాధానం చెప్పగలదు. కానీ సూచనలు ఇలా ఉన్నాయి. అది ఇప్పుడే జరగవచ్చు లేదా జరగకపోవచ్చు కానీ రాబోయే సంవత్సరంలో జరిగితే అది పెద్ద విషయం కాదని రానా అంటున్నారు.
ఇండియాలో డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరిగాయని, డిజిటల్ కరెన్సీ ఈ-రూపాయిని ప్రవేశపెట్టడానికి ఆర్బిఐ సన్నాహాలు చేస్తోందని రాణా అన్నారు. అటువంటి పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ కూడా కరెన్సీ ముద్రణ ఖర్చును తగ్గించాలని కోరుకుంటుంది. నిజానికి, ప్రభుత్వం నోట్ల ముద్రణకు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న నోట్లను ATMలలో ఎక్కువ చెలామణిలోకి తీసుకురావాలని కోరుకుంటోంది. రూ.2000 నోటు లానే రూ.500 నోటు సరఫరాను క్రమంగా ఆర్బీఐ తగ్గించాలని భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
అందుకే దేశంలో చిన్న నోట్ల చెలామణిని పెంచవచ్చు. రాణా ప్రకారం.. రూ.500 నోట్లను నిల్వ చేసుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు.