ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
IPL 2023 - SRH vs KKR : లైఫ్ అండ్ డెత్ గేమ్.. టాస్ గెలిచిన కేకేఆర్.. హైదరాబాద్ జట్టులోకి యంగ్ గన్..
Updated on: 2023-05-05 18:23:00

IPL 2023 - SRH vs KKR : ఈ సీజన్లోని 19వ మ్యాచ్లో ఇరుజట్లు తలపడగా, హైదరాబాద్ 23 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో హ్యారీ బ్రూక్ సీజన్లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
ఐపీఎల్ 2023 (IPL 2023) మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్లో విజయం సాధించడం తప్పనిసరి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. డేవిడ్ వీస్ స్థానంలో జాసన్ రాయ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక.. ఎన్ జగదీషన్ స్థానంలో వైభవ్ అరోరా చోటు దక్కించుకున్నాడు. ఇక, హైదరాబాద్ జట్టులోకి కార్తీక్ త్యాగి వచ్చాడు. ఈ యంగ్ పేసర్ గాయం కారణంగా ఫస్ట్ 8 మ్యాచులకు దూరమయ్యాడు.