ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఎమ్మెల్యే కోరుకంటి మానవత్వం
Updated on: 2023-09-24 06:34:00

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టి రోజు సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి అరుదైన కానుక ఇచ్చారు. మంత్రి కేటీఆర్ జన్మదినం గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఇంటిని నిర్మించి ఇచ్చారు. శనివారం వారితో గృహప్రవేశం చేయించారు. అలాగే అంతర్గాం మండలంలోని గోలివాడ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు 30 మందికి ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. రామగుండం కార్పొషన్ పరిధి 37వ డివిజన్‌కు చెందిన నిరుపేద కొండ రాజేశ్వరి నివసించేందుకు ఇల్లులేదు.తన ఇంటి సమీపంలో ఉండే ఆమె దయనీయస్థితిని తెలుసుకున్న చందర్ కొన్ని నెలల కిందట రూ. లక్ష వెచ్చించి ఇంటిని నిర్మించిఇచ్చాడు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా వారితో రిబ్బన్ కట్ చేయించి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి తనకు ఇల్లు నిర్మించి ఇచ్చిన కోరుకంటికి మనసారా కృతజ్ఞతలు తెలిపింది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నది.