ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
భూమా అఖిలప్రియ నిరాహార దీక్ష భగ్నo
Updated on: 2023-09-23 12:42:00
నంద్యాల జిల్లాలో టీడీపీ నేత,మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రెండు రోజులుగా ఆమె నిరాహార దీక్ష చేపట్టారు.నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆమె దీక్షకు దిగారు.ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్రెడ్డి సైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు.దీంతో పోలీసులు శనివారం వేకువ జామున ఆమె దీక్షను భగ్నం చేశారు.అక్కడి నుంచి ఆమెను నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆళ్లగడ్డకు తరలించారు.ఆళ్లగడ్డలోని నివాసంలోనికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారు.పోలీసుల వాహనంలోనే దీక్షను కొనసాగిస్తానని ఆమె పట్టుబట్టారు.ఈ దశలో ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను,ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేసి ఆమె నివాసానికి తరలించారు.