ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
చంద్రబాబుకు మద్దతుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి వైద్య పరీక్షలు
Updated on: 2023-09-22 21:55:00

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా నంద్యాలలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజు కొనసాగుతోంది. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద అక్కా తమ్ముడు దీక్ష చేపట్టారు. చంద్రబాబు బయటకు వచ్చే వచ్చే వరకూ.... దీక్ష విరమించేది లేదని అఖిల ప్రియ స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్రబాబును అరెస్టు చేశారని అఖిల ప్రియ ఆరోపించారు.
నంద్యాలలో ఆమరణ దీక్ష చేస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగి 30 గంటలు అయిందని, షుగర్ లెవెల్స్ బాగా తగ్గాయని వైద్యులు తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగిస్తే ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని వైద్యులు చెప్పారు.