ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
లంచము తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన జలకనూరు వీఆర్ఓ వెంకట రమణారెడ్డి
Updated on: 2023-09-14 10:28:00
నంద్యాల జిల్లా మిడుతూరు మండలము జలకనూరు గ్రామానికి చెందిన వెంకట రమణయ్య తన ముగ్గురు కూతుర్ల పేరిట తన భూమిని దాన విక్రయముగా రిజిస్టరు చేయించాడు.సదరు భూమిని తన పేరు నుండి వారి పేర్లపై ఆన్లైన్ నందు మార్పు చేసి పాసు బుక్కులు ఇవ్వడానికి గాను వీఆర్వో వెంకట రమణా రెడ్డి అనే ఫిర్యాదు ధారుడైన వెంకట రమణయ్య అనే వ్యక్తి నుండి 10000/- రూపాయలు లంచము ఆశించి ముందుగా 3000/- రూపాయలు తీసుకుని మిగిలిన 7000/- రూపాయలు లంచము మిడుతూరు గ్రామంలోని తన ప్రైవేటు కార్యాలయము నందు తీసుకుంటూ ఉండగా బుధవారము నాడు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఈ దాడులలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు తేజేశ్వర్ రావు,వెంకట కృష్ణారెడ్డి,ఇంతియాజ్ అహ్మద్, కృష్ణయ్య,వంశినాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలియజేశారు.ప్రజలకు ఏసీబీ డీఎస్పీ విజ్ఞప్తి మీ చట్టబద్దమైన పనిని చేయడానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచము ఆశిస్తే ముందుగా 14400 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి గాని 14400 మొబైల్ ఆప్ ద్వారాగాని సమాచారమును అందించగలరు.సదరు లంచగొండి అధికారులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని కర్నూలు ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి కోరారు.