ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్‌లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
దేహదారుఢ్య పరీక్షలకు 1136 మంది అభ్యర్థులు హాజరు
Updated on: 2023-09-14 07:43:00

ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న సివిల్ ఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ, ఏపీఎస్పీ పోస్టుల భర్తీకి స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గతనెల 25 నుంచి అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం 1136 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, ఎత్తు, ఛాతీ కొలతలు నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన హాజరు కావాల్సిన అభ్యర్ధులు వర్షకారణంగా వారిని 14వ తేదీన హాజరు కావాలని ఇప్పటికే సూచించారు. చివరి రోజు 15వ తేదీన కూడా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం ఆయన పోలీసు పెరేడ్ గ్రౌండ్‌ను స్వయంగా పరిశీలించారు. చిన్న చిన్న గుంతలు ఉంటే వాటిలో మట్టి పోయించి చదును చేయించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆయనే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకున్నారు.